బ్రేకింగ్

breaking
27 Nov 2022 | 12:53 IST

వైకాపా రాజకీయ పార్టీయా? ఉగ్రవాద సంస్థా?: పవన్‌

మంగళగిరి: ఇప్పటంలో గడపలు కూల్చారు.. వైకాపా గడప కూల్చేవరకు నిద్రపోమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘మాకు ఓట్లు వేసినా.. వేయకున్నా.. మీ కష్టాల్లో అండగా ఉంటా. ఇప్పటం గ్రామస్థుల్లా.. అమరావతి రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదు. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. 30 ఏళ్లు అధికారంలో ఉండాలని వైకాపా కోరుకుంటోంది. వైకాపా రాజకీయ పార్టీయా.. ఉగ్రవాద సంస్థా? సజ్జల డిఫ్యాక్టో సీఎం. వైకాపా నేతలది ఆధిపత్య అహంకారం. కోడికత్తిలా మేం డ్రామాలాడలేం. మీ ఫ్యూడలిస్టుల కోటలు బద్దలుకొడతాం’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు