బ్రేకింగ్

breaking

హైదరాబాద్‌లో తొలిసారి అండర్ గ్రౌండ్‌ మెట్రో

[18:58]

హైదరాబాద్‌: మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రో కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని