బ్రేకింగ్

breaking

గనిలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి!

[17:19]

జగ్దల్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జగ్దల్‌పూర్‌లోని సున్నపురాయి గనిలో తవ్వకాలు జరుపుతుండగా పెళ్లలు పడి ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, యువకుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దర్ని సురక్షితంగా కాపాడారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కార్మికులను కాపాడేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని

తాజా వార్తలు