బ్రేకింగ్

breaking

వైకాపా ఊరికొక సైకోను తయారు చేస్తోంది: CBN

[17:44]

నిడదవోలు: రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతోందని.. ఇదంతా చూస్తుంటే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని విమర్శించారు. వైకాపా పాలనలో ఊరికొక సైకోను తయారుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘అమరరాజా పరిశ్రమను తెలంగాణలో పెడుతున్నారు. ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లారు. పరిశ్రమలు తరలిపోతుంటే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని