బ్రేకింగ్

breaking

భారత్‌ లక్ష్యం లేకుండా ముందుకెళ్తోంది: కేసీఆర్‌

[19:21]

హైదరాబాద్‌: భారత్‌ ఎలాంటి లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌, ఇతర నేతలు కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో దౌర్జన్యంతో ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా మారింది. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ, ప్రజలు ఓడుతున్నారు. నిజానికి గెలవాల్సింది పార్టీలు, నేతలు కాదు.. ప్రజలు. అదే అసలైన ప్రజాస్వామ్యం. భారత్‌లో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఇష్టారీతిన విమర్శలు చేస్తారు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యపడుతాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా భారాస మార్పు తెస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని