బ్రేకింగ్

breaking

నాన్న మౌనం వీడితే ఎవరూ భరించలేరు: రామ్‌చరణ్‌

[22:11]

హనుమకొండ: ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ సభలో హీరో రామ్‌చరణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన మౌనం వీడితే భరించలేరు. నాన్న మౌనంగా ఉంటారేమో కానీ, మేం కాదు. ఆయన్ని ఏమైనా అంటే మేం ఊరుకోమని చెబుతున్నా. ఆయనను అనాలంటే కుటుంబసభ్యులైనా.. అభిమానులైనా అయి ఉండాలి’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రామ్‌చరణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని