బ్రేకింగ్

breaking
01 Feb 2023 | 11:50 IST

సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్‌.. రైల్వేకు 2.4లక్షల కోట్లు

దిల్లీ: రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.  రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం ₹13.7లక్షల కోట్లు కేటాయిస్తాం. రైల్వేకు ₹2.4లక్షల కోట్లు ఇస్తున్నాం. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు కేటాయించాం. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’’ అని నిర్మల వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు