బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 10:43 IST

అలా చేస్తేనే భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుంది: కేటీఆర్‌

హైదరాబాద్: భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారు. అయితే, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దృష్టి అంతా ఎన్నికలపైనే ఉంటుంది. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే. ఇతర దేశాల మాదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్‌ వన్‌గా ఎదుగుతాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని