బ్రేకింగ్

breaking

TSPSC: రద్దయిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ఖరారు

[20:18]

హైదరాబాద్‌: పేపర్‌ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసి తాజాగా  పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది.

మరిన్ని

తాజా వార్తలు