బ్రేకింగ్

breaking

ఏమీ ఇవ్వని భాజపా రాష్ట్రంలో ఎందుకు?: కేటీఆర్‌

[16:48]

హైదరాబాద్‌: ప్రధాని మోదీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యత క్రమంలో మాత్రం ఆయన ఎందుకు ఉండాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం ఇచ్చేది లేదని కేంద్రంలోని భాజపా చెప్పిందన్నారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని ఆ పార్టీ రాష్ట్రంలో ఎందుకు ఉండాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్‌, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. వీటన్నింటికి రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు బాధ్యత వహించాలి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు