బ్రేకింగ్

breaking

KCRను ఓడించాలంటే మనం కలవాలి: ఆ ఇద్దరికి షర్మిల ఫోన్‌

[12:00]

హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఫోన్‌ చేశారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ప్రగతిభవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. ‘‘కేసీఆర్‌ను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలిసి పోరాడకపోతే ప్రతిపక్షాలను కేసీఆర్‌ బతకనివ్వరు’’ అని షర్మిల తెలిపారు. దీనిపై బండి స్పందించారు. ఉమ్మడి పోరాటానికి మద్దతు ప్రకటించారు. దీనిపై త్వరలోనే సమావేశమవుదామని షర్మిలతో చెప్పారు. ఈవిషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు