బ్రేకింగ్

breaking

నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్‌

[15:37]

హైదరాబాద్‌: ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు చూశానని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలేనని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతు నేత శరద్‌జోషి, ప్రణీత్‌, తదితరులు భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. రైతుల పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. సాగు చట్టాలపై రైతులు చేసిన పోరాటం న్యాయమైందని.. తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. సీఎంగా ఉండి కూడా తాను రైతుల కోసం దిల్లీలో పోరాటం చేశానన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని