బ్రేకింగ్

breaking
19 Sep 2023 | 07:45 IST

హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

చెన్నై: నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె (16) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె 12వ తరగతి చదువుతోంది.

మరిన్ని

తాజా వార్తలు