బ్రేకింగ్

breaking
19 Sep 2023 | 15:44 IST

ఖర్గే ప్రసంగంపై సీతారామన్‌ అభ్యంతరం

దిల్లీ: మహిళా బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. 2010లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పారు. అన్ని పార్టీలు మహిళను చిన్న చూపు చూస్తున్నాయని, వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలని అన్నారు. ప్రశ్నించలేని మహిళలకు భాజపా అవకాశం ఇచ్చిందని విమర్శించారు. దీంతో ఆయన ప్రసంగాన్ని భాజపా సభ్యులు అడ్డుకున్నారు. ఖర్గే ప్రసంగంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు