బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 16:04 IST

అమరావతిలో చంద్రబాబు పర్యటన ఖరారు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలు, శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు, ఐకానిక్‌ నిర్మాణాల కోసం మొదలుపెట్టిన సైట్లు పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల స్థితిగతులు తెలుసుకోనున్నారు.

మరిన్ని

తాజా వార్తలు