బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 18:04 IST

21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

మరిన్ని

తాజా వార్తలు