బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 19:36 IST

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్‌ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు.

మరిన్ని

తాజా వార్తలు