బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 09:36 IST

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌

అమరావతి: మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్‌ ముందు పెట్టే ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న లోకేశ్‌కు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు.

మరిన్ని

తాజా వార్తలు