బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 10:30 IST

T20 WC: వెస్టిండీస్‌పై విజయం.. సెమీస్‌కు దక్షిణాఫ్రికా

టీ20 వరల్డ్‌ కప్‌లో వెస్టిండీస్‌ కథ ముగిసింది. సూపర్‌-8లో విండీస్‌పై దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 135/8 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాటర్‌ రోస్టన్‌ చేజ్‌ 52 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ షంషీ 3 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 124 పరుగులు చేసి విజయం సాధించింది. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 3.. రస్సెల్‌, జోసెఫ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

మరిన్ని

తాజా వార్తలు