బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 11:11 IST

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

అమరావతి: ఏపీ క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని

తాజా వార్తలు