బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 18:26 IST

భారత్‌మాల స్థానంలో కొత్త విధానం: మంత్రి కోమటిరెడ్డి

దిల్లీ: రోడ్లు, రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ‘భారత్‌ మాల’ స్థానంలో కొత్త విధానం రాబోతోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో పర్యటిస్తోన్న ఆయన.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్‌-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరినట్లు తెలిపారు. ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు