బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 21:17 IST

పార్టీ నియమ నిబంధనలు పాటిస్తా: జీవన్‌రెడ్డి

జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్‌ చేరికపై కార్యకర్తల మనోభావాలు పట్టించుకోలేదన్నారు. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని పార్టీ నేతలు తనకు చెప్పినట్లు తెలిపారు. 

మరిన్ని

తాజా వార్తలు