బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 21:55 IST

T20WC: రోహిత్‌ సెంచరీ మిస్‌.. ఆసీస్‌ లక్ష్యం 206

సెయింట్‌ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(92)కు కొద్దిలో సెంచరీ మిస్‌ అయింది. కోహ్లీ(0) నిరాశపర్చాడు. రిషభ్‌ 15, సూర్య 31, శివమ్‌ 28, హార్దిక్‌ 27*, జడేజా 9* పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, స్టాయినిస్‌ రెండేసి వికెట్లు తీశారు. హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

మరిన్ని

తాజా వార్తలు