బ్రేకింగ్

breaking
11 Jul 2024 | 08:36 IST

ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సిందని.. కానీ ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని ప్రభాకర్‌రావు చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు