₹499 చెల్లించి విద్యుత్తు స్కూటర్‌ బుక్‌ చేసుకోవచ్చు: ఓలా - Ola Electric scooter bookings open at Rs 499
close

Published : 16/07/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

₹499 చెల్లించి విద్యుత్తు స్కూటర్‌ బుక్‌ చేసుకోవచ్చు: ఓలా

దిల్లీ: త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్‌కు బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్‌.కామ్‌లో రూ.499 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ‘అద్భుత పనితీరు, సాంకేతికత, డిజైన్, ఆకర్షణీయ ధర.. ఇవన్నీ ఈ వాహనం వైపు వినియోగదారులను మొగ్గు చూపేలా చేస్తాయ’ని ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని