Skoda Kushaq: భారత్‌లోకి స్కోడా కుషాక్‌..! - Skoda Kushaq Launched In India
close

Updated : 28/06/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Skoda Kushaq: భారత్‌లోకి స్కోడా కుషాక్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సరికొత్త స్కోడా కుషాక్‌ ఎస్‌యూవీ భారత్‌ మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధర రూ.10.50లక్షలుగా నిర్ణయించారు. టాప్‌ఎండ్‌ కారు ధర రూ.17.60లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఫీచర్లను బట్టి ఈ కారు మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, రేనాల్ట్‌ డస్టర్లకు ఈ  కారు పోటీ ఇవ్వనుంది. ఈ కారును స్కోడా MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.  భారత్‌లోని రహదారులను దృష్టిలో పెట్టుకొని దీనిని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఈ కారు స్లీక్‌ లుక్స్‌తో కనిపించేలా స్కోడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంది. 

బటర్‌ఫ్లై గ్రిల్‌,ఎల్‌ఈడీ డై టైమ్‌ రన్నింగ్‌ లైట్లు, ప్రత్యేకమైన డిజైన్‌లో ఫాగ్‌ ల్యాంప్స్‌ వంటి ఆకర్షణలు ఉన్నాయి. హనీ ఆరెంజ్‌, టోర్నడో రెడ్‌,క్యాండీవైట్‌,బ్రిలియంట్‌ సిల్వర్‌, కార్బన్‌స్టీల్‌ రంగుల్లో లభిస్తుంది. మోడల్‌ను బట్టి16 అంగుళాలు, 17 అంగుళాల చక్రాలను దీనికి అమర్చారు. ఈ కారును 95శాతం భారత్‌లోని విడిభాగాలతోనే తయారు చేశారు.   

క్యాబిన్‌లో డ్యూయల్‌టోన్‌ కలర్స్‌ ఇచ్చారు. దీనిలో ఐదుగురు ప్రయాణించవచ్చు. బూట్‌స్పేస్‌ 385 లీటర్స్‌గా కంపెనీ పేర్కొంది. 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఇచ్చారు. దీనికి యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, వైర్‌లెస్‌ మిర్రర్‌ లింక్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌, వెనుక సీట్లకు ఏసీ వెంట్‌, మిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, క్రూజ్‌కంట్రోల్‌, యాంబియంట్‌ లైటింగ్‌, 7స్పీకర్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, టూస్పోక్‌ స్టీరింగ్‌, మై స్కోడా కనెక్ట్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు.  

ఈ కారు వేరియంట్‌ను బట్టి రెండు రకాల పెట్రోల్‌ ఇంజిన్లలో లభిస్తోంది. 1.0 త్రీ సిలిండర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇక 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ 148 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. సిక్స్‌స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. ఆప్షనల్‌గా సిక్స్‌స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఇచ్చారు. ఇక ప్రారంభ మోడల్‌లో రెండు ఎయిర్‌ బ్యాగ్స్‌ను ఇచ్చారు. హిల్‌ హోల్డ్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటర్‌, ఆటోహెడ్‌ల్యాంప్స్‌, వైపర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని