హ్యుందాయ్‌ కొత్త ఎస్‌యూవీ అల్కజార్‌
close

Updated : 19/06/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యుందాయ్‌ కొత్త ఎస్‌యూవీ అల్కజార్‌

ధరల శ్రేణి రూ.16.3-19.99 లక్షలు

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ ఎస్‌యూవీ శ్రేణిలో కొత్త మోడల్‌ అల్కజార్‌ను శుక్రవారం భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధరల శ్రేణి రూ.16.3-19.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అల్కజార్‌ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం  6, 7 సీట్ల సామర్థ్యంతో రూపొందింది. కొత్త మోడల్‌ అభివృద్ధి కోసం సుమారు  రూ.650 కోట్లు ఖర్చు చేసినట్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ500, ఇటీవల విడుదల చేసిన టాటా సఫారీ, హెక్టార్‌ ప్లస్‌లతో అల్కజార్‌ కొత్త ఎస్‌యూవీ పోటీ పడుతుందని కంపెనీ వెల్లడించింది. అల్కజార్‌ ఎస్‌యూవీలు 2-లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికతో అందుబాటులో ఉంటాయని తెలిపింది. పెట్రోల్‌ రకం ధర రూ.16.3-19.84 లక్షలు కాగా, డీజిల్‌ రకం రూ.16.53-19.99 లక్షల మధ్య లభిస్తాయని పేర్కొంది. మాన్యువల్‌ పెట్రోల్‌ రకం లీటర్‌కు 14.5 కి.మీ, ఆటోమేటిక్‌ వేరియంట్‌ 14.2 కి.మీ, డీజిల్‌ మాన్యువల్‌ రకం 20.4 కి.మీ, ఆటోమేటిక్‌ వెర్షన్‌ 18.1 కి.మీ.ల మైలేజీ ఇస్తాయని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని