చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లుండాలి
close

Updated : 20/09/2021 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లుండాలి

వాహన కంపెనీలకు గడ్కరీ సూచన

దిల్లీ: మధ్య తరగతి ప్రజలు అధికంగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా వాహన సంస్థలు చూడాలని కేంద్ర రవాణా, రహదారి మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఎంతసేపూ ధనవంతులు కొనుగోలు చేసే పెద్ద కార్లలోనే 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా కంపెనీలు చూసుకుంటున్నాయని, ఈ విషయం తనను ఎప్పుడూ ఆశ్యర్యానికి గురి చేస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో మరణాలు నిరోధించేందుకు ఎయిర్‌బ్యాగ్‌లు ఎంతగానో సహకరిస్తాయని, చిన్న ఎకానమీ కార్లలోనూ అధిక ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చి వినియోగదార్ల భద్రతకు వాహన సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని గడ్కరీ సూచించారు. చిన్న కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్‌లకు   తక్కువ వ్యయమే అయ్యే అవకాశం ఉందని, దేశంలో అందరికీ వాహన భద్రత సమానంగా ఉండాలని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని