బ్యాంకు లాక‌ర్ కోసంముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు - Register-for-the-bank-locker-wait-list
close

Published : 02/07/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకు లాక‌ర్ కోసంముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు

చాలా మంది బ్యాంక్ లాక‌ర్ ప్రారంభించేందుకు వారి ద‌గ్గ‌ర‌లోని బ్యాంకు శాఖ‌కు వెళ‌తారు. అయితే ఆ బ్యాంకు శాఖ‌లో కొన్ని లాక‌ర్‌లే అందుబాటులో ఉంటే మీకు స‌మ‌యానికి ల‌భించ‌క‌పోవ‌చ్చు. అప్పుడు బ్యాంకు, మీకు లాక‌ర్ స‌దుపాయాన్ని అనుమ‌తిని తిర‌స్క‌రిసస్తుంది
 మ‌రి ఏం చేయాలి?
 ఆ బ్యాంకును వ‌దిలేసి దూరంగా ఉన్న మ‌రొక బ్యాంకును సంప్ర‌దించడానికి బ‌దులుగా, బ్యాంకు లాక‌ర్ కోసం రిజిస్ట‌ర్ చేసుకుంటే అందుబాటులో ఉన్న‌ప్పుడు మీరు లాక‌ర్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంద‌న‌ల ప్ర‌కారం, బ్యాంకులు లాక‌ర్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌ను నిర్వ‌హించాలి. లాక‌ర్ కోసం సంప్ర‌దించిన‌వారికి వెయిట్ లిస్ట్ నంబ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని తెలిపింది.
బ్యాంకు లాక‌ర్లు ఫ‌స్ట్-క‌మ్-ఫ‌స్ట్‌-స‌ర్వ్ బేసిస్ లో ల‌భిస్తాయి. ఎవ‌రైనా లాక‌ర్ నుంచి నిష్ర్క‌మిస్తే ఆ అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. బ్యాంకు లాక‌ర్ ఉప‌యోగించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవ‌సరం లేద‌న్న విష‌యం గుర్తుంచుకోండి.
 ఫీజులు-ఛార్జీలు:
మీ వ‌స్తువుల‌ను బ్యాంకు లాక‌ర్‌లో పెట్టినందుకు గాను బ్యాంకుకు ఫీజు చెల్లించాలి. కొన్ని సార్లు బ్యాంకులు లాక‌ర్ స‌దుపాయం ఇచ్చేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించ‌మ‌ని కూడా అడ‌గ‌వ‌చ్చు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌ను మూడు సంవ‌త్స‌రాల అద్దెకు స‌మాన‌మైన‌ ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించ‌మ‌ని అడిగేందుకు అనుమ‌తి ఉంది.  ఏదైనా అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు లాకర్‌ను తెరిచేందుకు వీలుగా ఛార్జీలు తీసుకుంటాయి. ఎఫ్‌డీని సెక్యూరిటీ డిపాజిట్‌గా ప‌రిగ‌ణిస్తాయి. ఎఫ్‌డీపై వ‌చ్చే వ‌డ్డీని అద్దెగా బ్యాంకు పొందే విధంగా సూచ‌న‌లు పాటించ‌వ‌చ్చు.
రెగ్యుల‌ర్ ఆప‌రేష‌న్:
మీరు లాక‌ర్‌ను రెగ్యుల‌ర్‌గా ఆప‌రేట్ చేస్తుండాలి లేక‌పోతే బ్యాంకు దాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంటుంది. అయితే ర‌ద్దు చేసే ముందు బ్యాంకు నోటీస్ పంపుతుంది.  మ‌ధ్య‌స్థంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న వినియోగదారులు కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి లాకర్‌ను ఆపరేట్ చేయాలి, అయితే అధిక-రిస్క్ ఉన్న వినియోగదారులు కనీసం సంవత్సరానికి ఒకసారి దీన్ని ఆపరేట్ చేయాలి. ఆర్థిక లేదా సామాజిక స్థితి, వ్యాపార కార్యకలాపాల స్వభావం, వినియోగ‌దారుల స్టేట‌స్ వంటివి ప్రామాణికంగా చేసుకొని బ్యాంకులు తమ వినియోగదారులను తక్కువ నుంచి అధిక రిస్క్ ప్రొఫైల్స్‌గా వర్గీకరిస్తాయి.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని