పొదుపు ఖాతాపై అధిక వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తున్న‌ 3 బ్యాంకులు, వ‌డ్డీ రేట్ల వివ‌రాలు  - These-3-private-banks-offer-Highest-interest-rate-on-savings-account
close

Updated : 10/06/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొదుపు ఖాతాపై అధిక వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తున్న‌ 3 బ్యాంకులు, వ‌డ్డీ రేట్ల వివ‌రాలు 

బ్యాంకు లావాదేవీలు నిర్వ‌హించే ప్ర‌తీ ఒక్క‌రికీ ప్రాధ‌మికంగా ఉండాల్సింది పొదుపు ఖాతా. అందువ‌ల్ల ప్ర‌తీ వ్య‌క్తి ఈ ఖాతాలో న‌గ‌దు డిపాజిట్ చేస్తే వ‌డ్డీ ఎంత వ‌స్తుందో తెలుసుకోవాలి. ఆర్థిక అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో నిధుల ల‌భ్య‌త‌ను కోరుకునే పెట్టుబ‌డిదారులలో చాలా మంది పొదుపు ఖాతాలోనే డ‌బ్బు డిపాజిట్ చేస్తారు. అలాగే  స్వ‌ల్ప‌-కాలిక పెట్టుబ‌డి ల‌క్ష్య‌ల కోసం మంచి పెట్టుబ‌డి మార్గం దొర‌క‌ని వారు కూడా బ్యాంకు పొదుపు ఖాతాలోనే డ‌బ్బు మ‌దుపు చేస్తారు. ఇటువంటి వారు అధిక వ‌డ్డీనిచ్చే బ్యాంకు పొదుపు ఖాతాను ఎంచుకుంటే మంచి రాబ‌డి వ‌స్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌, బంధ‌న్ బ్యాంక్‌, య‌స్ బ్యాంక్‌.. ఈ మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులు పొదుపు ఖాతాల‌పై అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి.

ఆర్‌బీఎల్ బ్యాంక్‌..
భార‌తీయ బ్యాంకుల‌న్నింటిలోకి ఆర్‌బీఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాల‌పై అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్  ప్ర‌కారం, పొదుపు ఖాతాల‌పై 4.5 శాతం నుంచి 6.25 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది.  రోజువారి బ్యాలెన్స్ రూ.1 ల‌క్ష లోపు ఉన్న ఖాతాదారుల‌కు 4.5 శాతం,  రూ.1 ల‌క్ష కంటే ఎక్కువ.. రూ.10 ల‌క్ష‌ల లోపు ఉన్న వారికి 6 శాతం, రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ నిర్వ‌హించే వారికి 6.25 చొప్పున  వార్షిక వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. 

బంధ‌న్ బ్యాంక్‌..
సేవింగ్స్ అక్కౌంట్ తీసుకున్న‌వారికి బంధ‌న్ బ్యాంక్ 3 నుంచి 6 శాతం వ‌డ్డీని ఇస్తుంది. ఎంత వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంద‌నేది ఖాతాలో నిర్వ‌హించే బ్యాలెన్స్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. బంధ‌న్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం.. రోజువారి బ్యాలెన్స్ రూ. 1ల‌క్ష లోపు నిర్వ‌హించే వారికి 3 శాతం, రూ.1 ల‌క్ష నుంచి రూ.10 ల‌క్ష‌ల లోపు నిర్వ‌హించేవారికి 4 శాతం, రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ బ్యాలెన్స్  నిర్వ‌హించే ఖాతాదారుల‌కు 6 శాతం వార్షిక‌ వ‌డ్డీని బ్యాంక్ అందిస్తుంది. 

య‌స్ బ్యాంక్‌..
య‌స్ బ్యాంక్  అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం,  పొదుపు ఖాతాలో నిర్వ‌హించే బ్యాలెన్స్ ఆధారంగా 4 నుంచి 5.5 శాతం  వ‌డ్డీ రేటును అంద‌జేస్తుంది. రోజు వారి బ్యాలెన్స్ రూ.1 ల‌క్ష లోపు నిర్వ‌హించే వారికి 4 శాతం, రూ.1 నుంచి రూ.10 ల‌క్ష‌ల లోపు నిర్వ‌హించే వారికి 4.75 శాతం, రూ.10 ల‌క్ష‌ల‌కు మించి రూ.100 కోట్ల లోపు రోజు వారి బ్యాలెన్స్ నిర్వ‌హించే ఖాతాదారుల‌కు 5.5 శాతం చొప్పున వార్షిక వ‌డ్డీ రేటును బ్యాంక్ ఆఫ‌ర్ చేస్తుంది. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని