క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనేది మీ కార్డు వినియోగానికి సంబంధించిన వివరణాత్మక సారాంశం, ఇందులో చెల్లింపులు, కొనుగోళ్లు, క్రెడిట్ బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్లు మొదలైనవి ఉంటాయి. చాలా మంది అసలు స్టేట్మెంట్ ఏముందో మొత్తం చదివేందుకు శ్రద్ధ చూపించరు. వారికి అవసరమైనంత లేదా చెల్లించాల్సిన మొత్తాన్ని మాత్రమే చూస్తారు. స్టేట్మెంట్ మొత్తం ఒకసారి చదివితే మీకు ఉపయోగపడే అంశాలు ఏవైనానా ఉండవచ్చు.
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను పూర్తిగా చదవడం ఎందుకు ముఖ్యం?
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ మీరు బిల్లింగ్ కాలానికి క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించారో తెలిపే సారాంశం. ఒకవేళ మీరు చేయని ఖర్చులు కూడా అక్కడ ఉంటే, చూడకుండా బిల్లు చెల్లిస్తే నష్టపోయేది మీరే.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చదవడం మీకు అస్పష్టమైన లేదా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంలో సహాయపడుతుంది. క్రెడిట్ కార్డులు తరచూ కొన్ని క్లిక్‌లతో ఏదైనా కొనడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. తరచూ అలా చేస్తున్నప్పుడు, మనం చేసిన ఎంత ఖర్చు చేశామో మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి స్టేట్మెంటె క్షుణ్ణంగా చదివితే అనవసర చెల్లింపులు చేయకుండా మీకు ఉపయోగపడుతుంది. ఇది మా క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి, చెక్ చేయడానికి కూడా సహాయపడుతుంది, ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లను విశ్లేషించడం వల్ల ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్న విషయం తెలుస్తుంది. దీంతో క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. మీరు అనుభవజ్ఞుడైన క్రెడిట్ కార్డ్ వినియోగదారు అయినా లేదా క్రొత్తవారైనా, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఎలా చదవాలో తెలుసుకుంటే ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. ఎక్కువ ప్రయోజనం పొందడానికి సహాయపడుతుంది. దీంతో మీ రివార్డ్ పాయింట్లను తెలుసుకోవచ్చు. ఏదైనా మోసాలు ఉంటే గుర్తుంచవచ్చు.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో చూడాల్సిన 10 ముఖ్యమైన విషయాలు:
స్టేట్మెంట్ గడువు తేదీ: ఇది చెల్లింపు గడువు తేదీ, స్టేట్మెంట్ గడువు తేదితో అయోమయం చెందకూడదు. స్టేట్మెంట్ గడువు తేదీ అంటే మీ స్టేట్మెంట్ జనరేట్ అయిన తేదీ మాత్రమే. ఆలస్య చెల్లింపులపై వడ్డీ లెక్కింపు సాధారణంగా స్టేట్మెంట్ మొదటి తేదీ నుంచి మీరే చెల్లించే నాటివరకు ఉంటుంది.
చెల్లింపు గడువు తేదీ: ఇది బకాయి మొత్తాన్ని కార్డ్ జారీచేసే సంస్థకు జమ చేయవలసిన తేదీ. మీరు చెక్ ద్వారా మొత్తాన్ని పరిష్కరిస్తుంటే, క్లియరెన్స్ కోసం 2-3 రోజులు పట్టవచ్చని గుర్తుంచుకోండి. ఈ కారణంగా, చెల్లింపు గడువు తేదీ వరకు చెల్లింపులను వాయిదా వేయడం మంచిది.
గ్రేస్ పీరియడ్: చెల్లింపు గడువు తేదీ తర్వాత మూడు రోజుల 'గ్రేస్ పీరియడ్ ఉంటుంది. విధిస్తారు. గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే మొత్తంపై ఆలస్యం చెల్లింపు కింద వడ్డీని లెక్కిస్తారు. ఇది తదుపరి స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అయితే చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒక చెల్లింపు గడువు నుంచి తదుపరి గడువు తేదీ వరకు 20 నుంచి 25 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి.
చెల్లించాల్సిన కనీస మొత్తం: ఇది చెల్లించాల్సిన మొత్తంలో (సాధారణంగా 5 శాతం) లేదా అతి తక్కువ మొత్తంలో (కొన్ని వందల రూపాయలు) ఆలస్యం ఫీజులను నివారించేందుకు ఈ కనీస మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ, మొత్తం చెల్లించేవరకు వడ్డీ బకాయి పెరుగుతూనే ఉంటుంది. కనీస చెల్లింపు కేవలం ఆలస్య రుసము పడకుండా ఆపుతుంది.
చెల్లించాల్సిన మొత్తం: మునుపటి నెలలో ఖర్చు చేసింది మాత్రమే కాకుండా, వర్తించే వడ్డీ లేదా ఆలస్యంగా చెల్లించే ఛార్జీలు, మునుపటి బిల్లు నుంచి ముందుకు తీసుకెళ్లడం, సేవా ఛార్జీలు, ఓవర్‌డ్రాన్ ఫీజు, లావాదేవీల రుసుము, నగదు ముందస్తు ఛార్జీలు మొదలైనవి. మీ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము, ఇవన్నీ కలిపి చెల్లించాల్సిన మొత్తం అవుతుంది.
బిల్లింగ్ సైకిల్: ఇది వరుసగా రెండు స్టేట్మెంట్ తేదీల మధ్య కాలం. సాధారణంగా, బిల్లింగ్ సైకిల్ 30 రోజుల వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ 30 రోజులలో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ప్రతిబింబిస్తాయి.
లావాదేవీల వివరాలు: స్టోర్‌లో, ఆన్లైన్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీల జాబితా ఇది. ఇది తేదీ, వివరాలు, లావాదేవీ విలువను కలిగి ఉంటుంది. ఏమీ తప్పు లేదని నిర్ధారించడానికి వీటిని జాగ్రత్తగా చూడటం ముఖ్యం. మీ ఖర్చు అలవాట్లను విశ్లేషించుకొని, దీర్ఘకాలంలో ఎక్కువ పొదుపు చేసేందుకు, తక్కువ ఖర్చు చేసేందుకు లావాదేవీలను పరిశీలించడం ఉపయోగపడుతుంది.
క్రెడిట్ పరిమితి: ఇది మీ క్రెడిట్ కార్డుపై బ్యాంక్ నిర్ణయించిన పరిమితి, ఇది మీరు కార్డుపై ఖర్చు చేసేందుకు వీలైన మొత్తం. క్రెడిట్ పరిమితిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
రివార్డ్ పాయింట్లు: మీ రివార్డ్ పాయింట్లను గమనిస్తూ వాటి గడవువు ముగియక ముందే రిడీమ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డుల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఈ రివార్డ్ పాయింట్లు, వీటిని సరిగా ఉపయోగించినట్లయితే కాలక్రమేణా గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు
ముఖ్యమైన సమాచారం: వడ్డీ రేట్లు లేదా వినియోగ నిబంధనల్లో ఏవైనా మార్పులు చేస్తే ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని చదవడంతో మీ క్రెడిట్ కార్డును అర్థం చేసుకోవడానికి, తెలివిగా ఉపయోగించటానికి సహాయపడుతుంది."
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోని ఈ ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకుంటే కార్డును మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, సరైన పద్ధతిలో కార్డును నిర్వహించడానికి సహాయపడుతుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?