Contact less cards: ఆ కార్డులతో జాగ్రత్త
close

Updated : 01/10/2021 06:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Contact less cards: ఆ కార్డులతో జాగ్రత్త

పండగల వేళ కొనుగోళ్ల జోరు మొదలవుతోంది. ఈ నేపథ్యంలో డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డునూ విరివిగా ఉపయోగిస్తుంటాం. కార్డులను వినియోగించడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోసగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంటాక్ట్‌లెస్‌ కార్డులను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం అన్ని బ్యాంకులూ కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. బిల్లు చెల్లించేటప్పుడు దుకాణదారుడి చేతికి ఇవ్వకుండానే రూ.5,000 లోపు బిల్లును అలా కార్డు యంత్రానికి (పీఓఎస్‌) కాస్త దగ్గరగా చూపించి చెల్లించేయొచ్చు. పిన్‌ నమోదు చేయాల్సిన అవసరమూ ఉండదు. కానీ, ఇక్కడే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

* సాధారణ చిప్‌ కార్డుతో పోలిస్తే.. ఈ కాంటాక్ట్‌లెస్‌ కార్డు సురక్షితమే. మీ కార్డు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఎవరూ దీన్ని క్లోన్‌ చేయడానికి అవకాశం ఉండదు. అయితే, దీన్ని ఇతరుల చేతికి ఇవ్వకూడదు.

* పొరపాటున కార్డు పోతే.. రూ.5,000 వరకూ ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. అందుకే, గుర్తించిన వెంటనే కార్డును బ్లాక్‌ చేయాలి.

* బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాలో లేదా అధీకృత యాప్‌ ద్వారా కాంటాక్ట్‌లెస్‌ కార్డును నియంత్రించవచ్చు. అవసరం లేదు అనుకుంటే.. దాన్ని ఆఫ్‌ చేయొచ్చు.

* కార్డు లావాదేవీలు చేసేందుకు ఉపయోగించే రహస్య సంఖ్యను ఎవరికీ చెప్పకూడదు. నాలుగు అంకెల పిన్‌కు బదులుగా ఆరు అంకెల పిన్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం.

* మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా పండగల వేళ మీ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఫోన్లు వస్తుంటాయి. ఇవన్నీ నిజం కాదు. నిజంగా బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఖాతాదారులకు ఫోన్లు చేయరు. వెబ్‌సైట్లు లేదా ఇ-మెయిల్‌ ద్వారానే బ్యాంకులు సమాచారాన్ని అందిస్తాయి. మీ కార్డు చివరి నాలుగు అంకెలు చెప్పినంత మాత్రాన మీకు ఫోన్‌ చేసిన వారు నిజమైన బ్యాంకు అధికారులు కారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని