అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని మూసేయండిలా..  - how-to-close-unwanted-bank-accounts
close

Updated : 29/01/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని మూసేయండిలా.. 

వివిధ కార‌ణాల‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలు మారిన‌ప్పుడు బ్యాంకు ఖాతా మారడం సాధార‌ణం. అయితే కొత్త ఖాతా తీసుకున్న‌ప్పుడు పాత‌ది మూసేయ‌డం మంచిది. ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే క‌నీస నిల్వ‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. వాటితో రాబ‌డి ఎక్క‌వ ఉండ‌దు. దీంతో పాటు ఎక్కువ ఖాతాలుంటే వాటిని చెక్ చేసుకోవ‌డం, కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎస్‌బీఐ ఖాతాల్లో మెట్రో, న‌గ‌ర ప్రాంతాల్లో రూ.3,000 క‌నీస నిల్వ ఉండాలి. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు రూ.2,000, గ్రామీణ ప్రాంతాల‌కు రూ.100 కనీస నిల్వ అవ‌స‌రం, లేక‌పోతే ఛార్జీలు ప‌డే అవ‌కాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. మ‌రి అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల‌ను మూసివేయ‌డం ఎలా తెలుసుకుందాం

ఖాతాను డీ-లింక్ చేయ‌డం:
మీరు మూసివేయాల‌నుకున్న ఖాతా ఏదైనా చెల్లింపుల సేవ‌ల‌కు అంటే ఫండ్స్ ఇండియా, పేటీఎం, స్విగ్గీ, ఉబ‌ర్ వంటి ఖాతాల‌కు అనుసంధానం చేసి ఉంటే వాటిని డీ-లింక్ చేయాలి. యుపీఐ పేమెంట్స్ మీ ఫోన్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. కాబ‌ట్టి మొద‌ట వాటిని డీ-లింక్ చేయాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి. దానికి బ‌దులుగా మీరు కొన‌సాగించాల‌నుకున్న‌ ఖాతాను అనుసంధానం చేస్తే చెల్లింపుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్ప‌టిలాగే కొన‌సాగుతాయి. కొన్ని ప్లాట్‌ఫాంలు డీ-లింక్ ఫారంను కూడా అడుగుతాయి.

క్లోజ‌ర్ ఫారం:
అన్ని బ్యాంకులు ఖాతా క్లోజ‌ర్ ఫారంను అందిస్తాయి. బ్యాంకు శాఖ లేదా వెబ్‌సైట్ ద్వారా దీనిని పొంద‌వ‌చ్చు. ఉమ్మ‌డి ఖాతా అయితే అంద‌రు దీనికి స‌మ్మ‌తి తెలపాల్సి ఉంటుంది. ఖాతాలో ఉన్న‌ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు మ‌రొక ఫారంలో ఖాతా నంబ‌ర్‌ను జ‌త చేసి ఇవ్వాల్సిందిగా అడుగుతుంది.


బ్యాంకు డాక్యుమెంట్లు:
బ్యాంకు జారీ చేసిన‌ ఉప‌యోగించ‌ని చెక్కు బుక్కుల‌ను, డెబిట్‌, క్రెడిట్ కార్లులు, పాస్‌బుక్‌, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోర‌వ‌చ్చు. ఖాతా క్లోజ‌ర్ ఫారంతో పాటు ఇవ‌న్నీ ఇవ్వాల్సి ఉంటుంది లేదా కొన్ని బ్యాంకులు ఈ డాక్యుమంట్ల‌ను చింపేయాల్సిందిగా చెప్తాయి.

ముగింపు ఛార్జీలు:
ఖ‌తా ప్రారంభించిన ఏడాదిలోగా మూసేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ, ఖాతా ప్రారంభించిన 14 రోజుల్లో మూసివేస్తే ఛార్జీలు లేవు. 15 వ రోజు నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500 ఛార్జీల‌తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఏడాది దాటితే మ‌ళ్లీ ఎలాంటి రుసుములు ఉండ‌వు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు స్వ‌తంత్రంగా ఈ ముగింపు ఛార్జీల‌ను విధించుకోవ‌చ్చు.

ఈ ప్రాసెస్ మొత్తం పూర్త‌యిన త‌ర్వాత బ్యాంకుకు చెల్లించాల్సిన‌ ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే చెక్ చేస్తాయి. ఖాతా ముగించిన‌ట్లు బ్యాంకు వ‌ద్ద‌ అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. ఇవ‌న్నీ స‌రైన విధానంలో చేసి అవ‌స‌రం లేని ఖాతాల‌ను మూసివేస్తేనే ఆర్థిక ప్ర‌ణాళిక‌కు ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని