కార్పొరేట్ ఎఫ్‌డిలో ఉన్న రిస్క్‌ల గురించి తెలుసుకోండి - Know-these-three-risks-before-investing-in-corporate-FD
close

Published : 29/07/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్ ఎఫ్‌డిలో ఉన్న రిస్క్‌ల గురించి తెలుసుకోండి

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, దేశంలో సామాన్య ప్ర‌జ‌ల‌కు అత్యంత సాధారణ, న‌మ్మ‌క‌మైన‌ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటి. అయితే బ్యాంకు ఎఫ్‌డిల వడ్డీ రేట్లు సుమారు 5 శాతానికి  పడిపోవడంతో, పెట్టుబడిదారులు కొంచెం మెరుగైన రాబడిని సంపాదించడానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికల కోసం వెతకడం ప్రారంభించారు.  అటువంటి పెట్టుబడిదారులకు ఆర్థిక స‌ల‌హాదారులు  AAA రేటింగ్ ఉన్న‌ కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను సిఫారసు చేయడం ప్రారంభించారు, అయితే  పెట్టుబ‌డుల‌కు ముందు ఇందులో ఉండే రిస్క్‌ల గురించి జాగ్ర‌త్త‌గా తెలుసుకోవ‌డం మంచిది.  బ్యాంక్ ఎఫ్‌డిల మాదిరిగా కాకుండా, కార్పొరేట్ ఎఫ్‌డిలు మూలధన భద్రతకు ఎటువంటి హామీని ఇవ్వవు. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి AAA రేటెడ్ కార్పొరేట్ ఎఫ్‌డిలు బ్యాంక్ ఎఫ్‌డి కంటే 1-2 శాతం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.

కార్పొరేట్ ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టేముందు ఈ మూడు విష‌యాల్లో పెట్టుబడిదారుడు జాగ్రత్తగా ఉండాలి:

డిఫాల్ట్ రిస్క్:

బ్యాంక్ ఎఫ్‌డిల మాదిరిగా కాకుండా, కార్పొరేట్ ఎఫ్‌డిలు అసురక్షితమైనవి.  మూలధన భ‌ద్ర‌త‌కు లేదా వడ్డీ చెల్లింపులకు హామీ ఇవ్వవు. ఒక సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే పెట్టుబడిదారుడు తన డబ్బును కోల్పోవచ్చు.

ప‌న్ను:

కార్పొరేట్ ఎఫ్‌డిలపై వడ్డీ పెట్టుబడిదారుడి ఆదాయానికి జోడించి, వారికి వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అత్యధిక పన్ను పరిధిలోకి వచ్చేవారికి, కార్పొరేట్ ఎఫ్‌డిలు ఆకర్షణీయంగా కనిపించవు.

ముంద‌స్తు ఉపసంహరణ రుసుము:
చాలా కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మూడు నెలల లాక్-ఇన్ వ్యవధితో వస్తాయి, ఈ స‌మ‌యంలో పెట్టుబడిదారుడు ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేడు. లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత కూడా, మెచ్యూరిటీకి ముందు ఉపసంహరించుకోవడం అంటే పూర్తి ఎఫ్‌డిని మూసివేయడం. పాక్షిక ఉపసంహరణ సౌకర్యం లేదు. అలాగే, ఎఫ్‌డి మెచ్యూరిటీకీ ముందే తీసుకుంటే కొంత వ‌డ్డీ కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

అయితే మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు, రిస్క్ ప్రొఫైల్ కోరుకునే వారు అత్యధిక రేటింగ్ కలిగిన, నిర్థేశిత‌ కంపెనీ ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టవచ్చని నమ్ముతారు.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని