సీనియ‌ర్ సిటిజ‌న్స్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్ తాజా వ‌డ్డీరేట్లు.. - Varios-banks-special-FD-scheme-for-senior-citizens-and-its-interest-rates
close

Published : 12/08/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియ‌ర్ సిటిజ‌న్స్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్ తాజా వ‌డ్డీరేట్లు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,  బీఓబీ బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అందిస్తున్న స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను సెప్టెంబ‌రు 30,2021 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం గోల్డ్‌న్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ గ‌డువు తేదిని అక్టోబ‌రు 7, 2021 వ‌ర‌కు పొడిగించింది. బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ప‌డిపోతుండ‌టంతో సీనియ‌ర్ సిటిజ‌న్ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు గత సంవ‌త్స‌రం ‘మే’ లో ఈ ప‌థకాన్ని ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో ప్రారంభించాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)..
సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం "ఎస్‌బీఐ వీకేర్" ప్ర‌త్యేక డిపాజిట్  ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఐదేళ్లు అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితితో ఈ ప‌థ‌కంలో డిపాజిట్ చేసిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు..సాధార‌ణంగా వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ల‌భిస్తుంది. సాధార‌ణ‌ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అద‌న‌పు వ‌డ్డీ రేటు అందిస్తుంది.  ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా,  సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.20శాతం వ‌డ్డీ అందిస్తుంది. 

ఐసిఐసీఐ బ్యాంక్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌..
సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం..ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డ్‌న్ ఇయ‌ర్స్ పేరుతో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా అందించే ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 6.30శాతం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..
"హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్" పేరుతో స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల అద‌నంగా ఆఫ‌ర్ చేస్తుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కంటే 75 బేసిస్ పాయింట్లు మేర‌ అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఈ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుతం వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..
సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ డిపాజిట్ల‌పై 100 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ అందిస్తుంది. ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం కింద (5 సంవ‌త్స‌రాల నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు) ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే, ఎఫ్‌డీకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

చివ‌రిగా..
సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను (బీపీఎస్‌) అందిస్తాయి. ప్ర‌త్యేక ఎఫ్‌డీ స్కీమ్ దానిపైన అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుంది. వడ్డీ రేట్లు త‌క్క‌వ‌గా ఈ స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ద్వారా ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తున్నప్ప‌టికీ,  5 సంవత్సరాల సుదీర్ఘ కాలం డబ్బును లాక్ చేయ‌డం మంచి ఆలోచన కాద‌ని నిపుణ‌ల అభిప్రాయం.

వీటి స్థానంలో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌,  లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ వ‌యో వంద‌న యోజ‌న కూడా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎంచుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు దిగువ‌న ఉన్న‌ ఈ స‌మ‌యంలో ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ఎంచుకోవ‌డం ద్వారా కూడా అధిక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌చ్చు.

పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ ప‌థ‌కం 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియ‌డ్‌తో వ‌స్తుంది.  ప్రస్తుత వ‌డ్డీ రేటు 7.4శాతం.  ఇది బ్యాంక్ ఎఫ్‌డిపై అందిస్తున్న వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ ప‌థ‌కంలో గరిష్టంగా రూ.15 ల‌క్షల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎలాంటి గ‌రిష్ట ప‌రిమితి లేదు. ముంద‌స్తు విత్‌డ్రాల‌పై రెండింటిలోనూ పెనాల్టీ విధిస్తారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని