ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికంలోకి అడుగుపెట్టాం. ఐటీఆర్ ఫైలింగ్‌కు చివరి తేది ఆగస్ట్ 31, 2019 వరకు ఉన్న సంగతి తెలిసిందే.
సంస్థ అందించే ఫారం 16 / 16A తో టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని ఫారం 26AS తో ఆదాయం, టీడీఎస్ వివరాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో పోల్చి చూసుకోవాలి. ఫారం16/16A, 26AS లో అన్ని వివరాలు సరిగా ఉంటే ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. లేకపోతే మీ సంస్థను అడిగి సరిచేసుకోవచ్చు.
అయితే పన్ను దాఖలు చేస్తే మీ పని అయిపోదు. తర్వాత ఆర్థిక లక్ష్యాల గురించి సమీక్షించుకోవాలి.
మీ పెట్టుబడులు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పన్ను ఆదా చేసే పథకాలలో పెట్టుబడులు ఉండాలి. అయితే పన్ను ఆదా ఒకటే ముఖ్య ఉద్దేశంగా కాకుండా రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి.
జులై వరకు ఎంత ఆదాయం పొందారు. ఇక మీదట ఎంత వస్తుంది. పెట్టుబడులకు ఎంత కేటాయించాలన్న విషయం గురించి ఆలోచించాలి. లిక్విడిటీ, రాబడి, లాక్-ఇన్ పీరియడ్, పన్ను మినహాయింపులు వంటివి అన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను పెట్టాలి. పిల్లల ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు, పదవీ విరమణ వంటి లక్ష్యాల కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలి.
ప్రతి లక్ష్యం కోసం రెండు లేదా మూడు స్కీముల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు ఒకదానిలో లాభం తక్కువైనా మరో దానిలో లాభపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్య కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే ఎక్కువ కాలం వేచిచూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అనుకున్నంత రాబడి పొందకపోవచ్చు.
అమ్మాయి కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలి. మార్కెట్లలో ఒడుదొడుకులు ఉన్నప్పుడు పెట్టుబడులను ఈక్విటీ నుంచి డెట్ ఫండ్లకు, డెట్ నుంచి లిక్విడ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లకు మార్చుకోవచ్చు. అయితే దీనివలన అసలు మొత్తం తగ్గే అవకాశం ఉంది.
అదేవిధంగా పదవీ విరమణ నిధి కోసం కేవలం ఈపీఎఫ్ మీద ఆధారడకుండా ఎన్‌పీఎస్‌లో కూడా పెట్టుబడులు పెట్టాలి. ఎన్‌పీఎస్‌లో కూడా ఈక్విటీలకు ఎక్కువగా కేటాయించాలి. దీంతో దీర్ఘకాలానికి ఎక్కువ రాబడి పొందవచ్చు.
ఈపీఎఫ్ రేట్లను ప్రభుత్వం నిర్ణయింస్తుంది. అవి వార్షికంగా 8 శాతం వరకు ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలు, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి 10 శాతం రాబడిని అంచనా వేయవచ్చు. అయితే ఈపీఎఫ్ నుంచి పిల్లల పెళ్లి, అత్యవసర చికిత్స, గృహ నిర్మాణం కోసం పాక్షికంగా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలా తీసుకుంటే ఈపీఎఫ్ మొత్తం తగ్గుతుంది. పదవీ విరమణ తర్వాత జీవనం కోసం అది సరిపోకపోవచ్చు.
పదేళ్ల తర్వాత మీరు ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటే డౌన్‌పేమెంట్ ఇంటి విలువలో 15-20 శాతం ఉంటుంది. మిగతాది గృహ రుణం పొందవచ్చు. దీనికోసం మీరు రెండు స్కీముల్లో పెట్టుబడులు చేయవచ్చు. భద్రత, వృద్ధి ,లిక్విడిటీ కలిగిన పథకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే పదేళ్ల తర్వాత మీరు ఇళ్లు ఎక్కడ కొనుగోలు చేస్తారో, ఎంత ధర ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడే పెట్టుబడులు ప్రారంభించాలి. దీనికోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు.
స్వల్ప కాలిక లక్ష్యాలు అంటే ఒక అయిదు సంవత్సరాల్లో డబ్బు కావాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. స్వల్ప కాలం పెట్టుబడుల కోసం పీపీఎప్, ఈక్విటీలు సూచించదగినవి కావు.
చివరగా
పెట్టుబడులు కేవలం పన్ను ఆదా కోసం చేయకూడదు. ప్రతి పథకానికి కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. మీ స్నేహితులు లేదా బందువులు పెట్టారని వారు చెప్పిన దానిలో పెట్టుబడులు చేయకూడదు. మీ లక్ష్యాలకు ఏది అనుగుణంగా ఉంటుందో దానినే ఎంచుకోవాలి. సరైన అవాగాహన లేకపోతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.
FINANCIAL GOALS
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?