బంగారం అమ్ముతున్నారా.. మంచి ధ‌ర రావాలంటే ఏం చేయాలి?  - How-to-get-best-price-when-selling-your-gold-jewellery
close

Updated : 09/06/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారం అమ్ముతున్నారా.. మంచి ధ‌ర రావాలంటే ఏం చేయాలి? 

ఆర్ధిక ప్ర‌ణాళిక‌లో బంగారం కూడా భాగ‌మే. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో డ‌బ్బు కావ‌ల్సి వ‌చ్చిన‌ప్ప‌డు బంగారం తాక‌ట్టుపెట్టి రుణం తీసుకోవ‌డం లేదా అమ్మ‌డం చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌లో ఆర్థిక అవ‌స‌రాల కోసం కొంత మంది బంగారాన్ని విక్ర‌యించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అమ్మేముందు కొన్ని విష‌యాలు గుర్తుపెట్టుకోండి.

* విక్ర‌యించే ముందు బంగారం బ‌రువు, క్యారెట్‌(బంగారం స్వ‌చ్చ‌త‌ను కొలిచే ప్రామాణికం)ల‌ను తెలుసుకోండి.  కొనుగోలు చేసిన‌ప్పుడు ఇచ్చే ర‌శీదుల‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం మంచిది. ఇలాంటి స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

* ర‌శీదులు లేక‌పోయానా ప్ర‌స్తుతం ఉన్న బ‌రువు, స్వ‌చ్చ‌త‌ను పరీక్షించి ర‌శీదు తీసుకోండి. 

* ఒకే దుకాణంలో కాకుండా నాలుగైదు షాపుల‌కు వెళ్ళి కొటేష‌న్ తీసుకోండి. బంగారం ధ‌ర‌ను నిర్ణ‌యించేందుకు స్టాండ‌ర్డ్ విధానాలు లేవు. అందువ‌ల్ల వేరు వేరు దుకాణాల‌లో కొటేష‌న్ తీసుకోమ‌ని చెబుతున్నారు నిపుణులు.

* అమ్మాల‌నుకుంటున్న‌ బంగారం స్వ‌చ్ఛ‌త గురించి మీకు ఖ‌చ్చితంగా తెలియ‌క‌పోతే..క్యారెట్ మీట‌ర్ అందుబాటులో ఉన్న ఒకటి కంటే ఎక్కువ షాపుల వ‌ద్ద స్వ‌చ్చ‌త‌ను ప‌రీక్షించండి. బంగారు న‌గ‌ల‌పై ఉండే హాల్‌మార్కింగ్ గుర్తు దాని స్వ‌చ్చత‌ను తెలియ‌జేస్తుంది.  కొనుగోలు దారులు అటువంటి ఆభ‌ర‌ణాల‌ను కొనేందుకు ఆశ‌క్తి చూపుతారు. 

* ఆభ‌రణాలు అమ్మాల‌న్నా, పాత న‌గ‌ల‌కు బ‌దులుగా కొత్త‌వి తీసుకోవాల‌న్నా .. గ‌తంలో ఆ ఆభ‌రాల‌ను కొనుగోలు చేసిన దుకాణాన్ని ఎంచుకోవడం మంచిది. కొన్ని దుకాణాలు, వారి వ‌ద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి.

* చిన్న చిన్న దుకాణాలు, తెలియ‌ని వారు మోసాలకు పాల్ప‌డే అవ‌కాశం ఉన్నందువ‌ల్ల న‌మ్మ‌క‌మైన దుకాణాల వ‌ద్ద గానీ, ప్ర‌సిద్ధ  బ్రాండ్‌ షాపుల‌కు గానీ వెళ్ల‌డం మంచింది. 

తుది ధ‌ర చెప్పే ముందు, ఆభ‌ర‌ణాల బ‌రువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద త‌గ్గిస్తారు. అందువ‌ల్ల విక్ర‌యించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది  న‌గల మొత్తం బ‌రువులో 20 శాతం వ‌ర‌కు వేస్టేటేజ్ కింద తీసివేసి ఆ మొత్తాన్ని త‌గ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభ‌ర‌ణాల‌కు ఎక్కువ వేస్టేజ్ లెక్కిస్తారు. 

* ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన త‌యారీ రుసుములు, విక్ర‌యించేప్పుడు తిరిగి రావు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని