Mutual Fund SIP: ఒక్క ‘సిప్‌’తో రూ.10 కోట్లు సంపాదించొచ్చని తెలుసా? - On-how-much-annual-return-on-can-expect-from-mutual-fund-SIP
close

Updated : 02/08/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mutual Fund SIP: ఒక్క ‘సిప్‌’తో రూ.10 కోట్లు సంపాదించొచ్చని తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌లో పెట్టుబ‌డులు పెడితే రూ.10 కోట్లు సంపాదించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా? అవును, ఇది సిప్‌తో సాధ్యమే. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చేసే పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి లాభాలు తెచ్చిపెడ‌తాయి. 12 శాతం రాబ‌డి అంచ‌నాతో 25 ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెడితే ఆర్థికంగా మెరుగైన‌ జీవితాన్ని పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిందేమంటే మీ వ‌ద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో డ‌బ్బు లేక‌పోయినా, ఉన్న‌దాంట్లోనే నెల‌కు కొంత సిప్‌లో డిపాజిట్ చేస్తుంటే, ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు. అయితే ప్ర‌తి ఏడాది మీ ఆదాయం పెరిగే కొద్ది సిప్ డిపాజిట్ కూడా పెంచుతూ పోవాలి. దీంతో చ‌క్ర‌వ‌డ్డీతో క‌లిపి రాబ‌డి పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన‌వారు, వేర్వేరు విభాగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారికి సిప్ స‌రైన ఎంపికని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు.

ఇక ఇప్పుడు 25 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డుల‌తో రూ.10 కోట్లు సంపాదించాలంటే నెల‌కు ఎంత మొత్తం సిప్ చేయాలో తెలుసుకుందాం.  అయితే, దీనికోసం కొంత రిస్క్ ఎక్కువ‌గా ఉండే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. సాధార‌ణంగా రిస్క్ త‌క్కువ‌గా ఉండి, 30 ఏళ్ల పాటు చేసే పెట్టుబ‌డుల‌కు సంవ‌త్స‌రానికి 10 శాతం సిప్ పెంచుతూ పోవాలి. కానీ ఇప్పుడు 25 సంవ‌త్స‌రాల్లో రూ.10 కోట్లు సంపాదించాలంటే ఏడాదికి 15 శాతం పెంచాలి.

25 ఏళ్ల పాటు 12 శాతం రాబ‌డిని అంచ‌నా వేస్తే, నెల‌కు రూ.15,000 డిపాజిట్ చేయాలి. మ్యూచువ‌ల్ ఫండ్ కాలిక్యులేట‌ర్ ప్ర‌కారం మొత్తం 25 ఏళ్ల‌లో రూ.3,83,02,743 కోట్లు పెట్టుబ‌డులు పెడితే, దానిపై మీరు రూ.6,36,52,376 పొందుతారు. దీంతో మొత్తం రాబ‌డి రూ.10 కోట్ల‌కు చేరుతుంది. నెలకు రూ.15 వేలు మదుపు చేయాలనుకునేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. భ‌విష్య‌త్తులో ఆర్థిక జీవనానికి భ‌రోసా ఉంటుంది. అయితే దీంతో పాటు బీమా, అత్య‌వ‌స‌ర నిధి వంటివి కూడా ఉండాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని