మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవగానే పెట్టుబడులను విక్రయించే వారుంటారు. దీనికి కారణం నష్టభయాన్ని తట్టుకోలోకపోవడం. అందుకే పెట్టుబడుల పోర్ట్ఫోలియో తయారు చేసుకునేటప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోగలరు అని అంచనా వేసుకొని ముందడుగు వేయాలి.
మదుపర్లు అంచనా వేసుకున్న దానికంటే, తక్కువ రాబడి వచ్చే పరిస్థితిని నష్టభయం అంటారు. ప్రభుత్వ సెక్యురిటీలలో తప్ప ప్రతీ పెట్టుబడి సాధనంలో ఎంతోకొంత నష్టభయం ఉంటుంది. నష్టభయ తీవ్రత ఆయా పెట్టుబడి సాధనాలు ఇచ్చే రాబడి పై ఆధారపడి ఉంటుంది. రాబడి, నష్టభయం రెండూ ఒకే దిశలో పయనిస్తాయి. ఎక్కువగా రిస్క్ ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నష్టభయం ఉన్న సాధనాల్లో తక్కువ రాబడి ఉంటుంది.
నష్టభయం వ్యక్తి వయసు, ఆదాయం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కో మదుపరికి ఒక్కోవిధంగా ఉంటుంది. సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సరైన నిర్ణయం తీసుకోగలరు. పెట్టుబడి చేసేముందు కొన్ని ప్రాథమిక విషయాలను పాటించడం ద్వారా నష్టం రాకుండా నివారించవచ్చు.
పెట్టుబడులు ప్రారంభించే ముందు ఎవరికి వారు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలి. ఒకవేళ ఏవైనా కారణాల చేత మార్కెట్లు 15 శాతం నష్టపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని ముందే వేసుకోవాలి. రిస్క్ ప్రొఫైలర్ లు వివిధ ఆర్థిక సంస్థలు తమ వెబ్సైట్ లలో ఉంచుతాయి. వాటిని పూరించి మదుపర్లు తమ నష్టభయాన్ని అంచనా వేసుకోవచ్చు.
ఉదాహరణకు, మధ్య వయస్లులో ఉన్న వ్యక్తికి, పదవీ విరమణకు చేరవలో ఉన్న వ్యక్తికి రిస్క్ తీసుకునే విషయంలో చాలా తేడా ఉంటుంది. మధ్య వయసు వ్యక్తి ఇంకా ఉద్యోగం చేసే వయసు ఉంటుంది కాబట్టి అతడు కొంత ఎక్కువ రిస్క్ ఉన్నవాటిలో పెట్టుబడులు చేసినా ఫర్వాలేదు. కానీ పదవీ విరమణ తీసుకున్న వ్యక్తి అయితే వయసు, బాధ్యతలు, నెలవారిగా ఆదాయం లేని కారణంగా అంత రిస్క్ తీసుకోలేడు. పెట్టుబడులు ప్రారంభించే ముందు మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత నష్టభయానికి సిద్థంగా ఉన్నారనేది విశ్లేషించుకోఉవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్కెట్ల ఒడుదొడుకులను అదిగమించి రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది.
పెట్టుబడి పెట్టే ముందు మదుపర్లు ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది కచ్చితంగా నిర్ణయించుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉండే ఈక్విటీ పెట్టుబడులలో పెట్టే ముందు దీర్ఘకాలం కొనసాగేందుకు సిద్ధం కావాలి. ఆర్థిక లక్ష్యాలను కూడా దానికి అనుగుణంగా ఏర్పరుచుకోవాలి. ఆ విధంగా మీరు ఎంత వరకు నష్టభయం తట్టుకోగలరు, పెట్టుబడుల లక్ష్యం ఏమిటి, ఎంతకాలం కొనసాగిస్తారు వంటి వాటిపై స్పష్టత ఉంటే నష్ట భయం ఒత్తిడిని ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?