పండుగ‌ బోన‌స్ అందిందా? ఏం చేస్తే బాగుంటుంది? - How to put your Diwali bonus to good use
close

Updated : 22/10/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండుగ‌ బోన‌స్ అందిందా? ఏం చేస్తే బాగుంటుంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావ‌ళికి బోన‌స్ వ‌స్తుందంటే.. ఏం ప్లాన్ చేయాలి? ఏం కొనాలి? అని ముందుగా జాబితా త‌యారు చేసిపెట్టుకుంటారు కొంద‌రు. కానీ ఈ డ‌బ్బుతో విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం, ఖరీదైన వస్తువులు కొనుగోలు వంటివి చేసే బదులు ముఖ్య‌మైన ఆర్థిక‌ప‌ర‌మైన ప‌నుల‌ను పూర్తిచేయాలంటున్నారు నిపుణులు. మ‌రి బోన‌స్‌ను ఎలా ఖ‌ర్చుచేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం..

అధిక వ‌డ్డీ రుణాలు చెల్లించండి..
అధిక వ‌డ్డీ రేటుతో కూడిన రుణాల‌ను ఎంత త్వ‌ర‌గా చెల్లిస్తే అంత మంచిది. వ్య‌క్తిగ‌త రుణాలు 15 శాతం నుంచి 22 శాతం అధిక వార్షిక వ‌డ్డీ రేటుతో వ‌స్తాయి. అలాగే క్రెడిట్ కార్డు రోల్ఓవ‌ర్ బ్యాలెన్స్‌పై వార్షికంగా 40 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఇలాంటి అధిక వ‌డ్డీ రుణాలు చిన్న‌వయినా, పెద్ద‌వ‌యినా ముందుగా చెల్లించాల‌ని నిపుణ‌లు సూచిస్తున్నారు.

బోన‌స్‌ మొత్తాన్ని మ‌రెక్క‌డైనా పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే వ‌డ్డీ కంటే ఇటువంటి రుణాల‌కు చెల్లించాల్సిన‌ వ‌డ్డీనే ఎక్కువ ఉంటుంది. అందువ‌ల్ల ముందుగా రుణం తీర్చ‌డం వ‌ల్ల వ‌డ్డీ ఆదా చేసుకోవ‌చ్చు. రుణాల ఈఎంఐ చెల్లింపులు ప్రారంభించిన కొత్త‌లో ఈఎంఐలో అధిక భాగం వ‌డ్డీ ఉంటుంది. అందువ‌ల్ల రుణాలు ప్రారంభంలో ఉన్న‌ప్పుడు పెద్ద మొత్తంలో డ‌బ్బు చేతికందితే రుణాలు చెల్లించ‌డ‌మే మంచిది. ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. కొన్ని రుణాల‌కు ముందుగా చెల్లిస్తే ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయి. రుణం ఎప్పుడు చెల్లిస్తున్నామనే అంశంపై ప్రీపేమెంట్ ఛార్జీలు ఆధార‌ప‌డి ఉంటాయి. వాటిని గురించి పూర్తిగా తెలుసుకుని రుణాల‌ను చెల్లించ‌డం మంచిది. 

ఎమర్జెన్సీ ఫండ్ టాప్‌-అప్‌..
క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్ల కాలంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకున్న వారికి కొంత‌ ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌నే చెప్పాలి. అలా ఖ‌ర్చుచేసిన అత్య‌వ‌స‌ర నిధిని మ‌ళ్లీ రీఫిల్ చేసేందుకు బోన‌స్ మంచి అవ‌కాశం. 
ఒక వేళ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌వస‌ర నిధిని ఏర్పాటు చేసుకోక‌పోతే.. క‌నీసం ఆరు నెల‌లు కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేయండి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎటువంటి ఆల‌స్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేలా డ‌బ్బు ఉంచండి.

కొత్త అప్పులు చేయ‌కుండా..

వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ వంటి గృహోపకరణాలను కొనుగోలుకు బోనస్‌ని ఉపయోగించవచ్చు. రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లించేకంటే నేరుగా డ‌బ్బు చెల్లించ‌డం మంచిది. బై-నౌ పే-లేట‌ర్‌, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫ‌ర్‌లు సౌక‌ర్య‌వంతంగా అనిపించిన‌ప్ప‌టికీ అవి వార్షికంగా 15 నుంచి 25 శాతం వ‌డ్డీ వ‌సూలు చేస్తాయి. విలువైన వ‌స్తువుల‌ను రుణం తీసుకుని కొనుగోలు చేసేకంటే.. బోన‌స్ డ‌బ్బుతో నేరుగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల వ‌డ్డీ ఆదా చేసుకోవ‌చ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని