బంగారం స్థిరాస్తి పెట్టుబడులు సాంప్రదాయ పెట్టుబడులుగా పేరొందాయి. వీటిలో పెట్టుబడులపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. రిస్క్ తక్కువ, రాబడి హామీ ఎక్కువగా ఉంటుందని ఈ పెట్టుబడులపై మొగ్గుచూపుతారు. దీంతోపాటు ఇళ్లు లేదా బంగారం ఉండటం కూడా భారతీయులకు ఒక సెంటిమెంట్. అయితే కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లాభాలు క్షీణించాయి. మరోవైపు బంగారం గత సంవత్సరం సానుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అనుకున్నంత సానుకూలత కనబడలేదు. లావాదేవీల వ్యయం కూడా చాలాఉ ఎక్కువ. అయితే అవసరం ఉన్నంత కాకుండా పెట్టుబడుల కోసం రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇప్పుడే బంగారం లేదా స్థిరాస్తి పెట్టుబడుల నుంచి ఉపసంహరించుకుంటే మీకు వర్తించే రేట్లు గురించి ముందు తెలుసుకోండి
బంగారం:
* మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే దీర్ఘకాలికంగా పరిగణిస్తారు
* స్వల్పకాలిక పన్ను- శ్లాబు రేటు ప్రకారం
* దీర్ఘకాలిక పన్ను- ఇండెక్సేషన్‌తో కలిపి 20.8 శాతం
సార్వభౌమ పసిడి బాండ్లు:
* లిస్ట్ అయితే 1 సంవత్సరాన్ని దీర్ఘకాలికంగా భావిస్తారు
* లిస్ట్ కాకపోతే 3 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు
* వడ్డీపై శ్లాబు రేటు ప్రకారం పన్ను
* స్వల్పకాలిక పన్ను: శ్లాబు రేటు ప్రకారం
* దీర్ఘకాలిక పన్ను: ఇండెక్సేషనతో కలిపి 20.8 శాతం ( మెచ్యూరిటీకి ముందు ట్రాన్స్ఫర్ చేసిన అన్‌లిస్టెడ్ బాండ్లు, లిస్టెడ్ బాండ్లు), మెచ్యూరిటీ సమయంలో ఎటువంటి పన్ను ఉండదు
రియల్ ఎస్టేట్:
* రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక పన్ను
* స్వల్పకాలిక పన్ను- శ్లాబు రేటు ప్రకారం
* దీర్ఘకాలిక మూలధన పన్ను - ఇండెక్సేషన్‌తో కలిపి 20.8 శాతం
లిస్టెడ్ గోల్డ్ బాండ్లు ఏడాది తర్వాత సెకండరీ మార్కెట్లో విక్రయిస్తే 10.4 శాతం పన్ను , ఇందులో సెస్ కూడా కలిపి ఉంటుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?