ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు
దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. వ్యక్తులకు 10 రోజులు గడువు పొడిగిస్తూ.. జనవరి 10వ తేదీ వరకు రిటర్నులు సమర్పించే వీలు కల్పించింది. వ్యాపార సంస్థలు ఫిబ్రవరి 15 వరకు రిటర్న్‌లు దాఖలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు తేదీని ప్రభుత్వం పొడిగించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. వ్యక్తులు రిటర్న్‌లు దాఖలు చేసేందుకు తొలుత జులై 31 గడువు తేదీ కాగా.. దానిని నవంబరు 30వ తేదీకి, ఆ తర్వాత డిసెంబరు 31కి మార్పు చేసింది. ఇప్పుడు తాజాగా ఆ గడువును జనవరి 10వ తేదీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..
వివాద్సే విశ్వాస్ డిక్లరేషన్‌కు గడువు జనవరి 31: ప్రత్యక్ష పన్నుల వివాద పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్ దాఖలు గడువు తేదీని కూడా నెల రోజులు పొడిగిస్తూ 2021 జనవరి 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్న్‌ల గడువును రెండు నెలల పాటు పొడిగించింది. 2021 ఫిబ్రవరి 28 వరకు దాఖలు చేయవచ్చని తెలిపింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?