close

Published : 22/04/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐటీఆర్ సహజ్ ఫారమ్‌ను దాఖలు చేయడానికి ఎవరు అర్హులు?

వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులు ఉపయోగించాల్సిన  ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాలను ఆదాయపు పన్ను శాఖ జారీచేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) మొత్తం 7 ఐటిఆర్ ఫారమ్‌ల‌లో పెద్దగా మార్పు లేన‌ట్లుగా తెలియ‌జేసింది. అయితే ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫారమ్‌లలో  కొన్ని చిన్న‌ మార్పులు ఉన్నాయి. వేత‌నం లేదా వ్యాపారం,  పెన్షన్, ఇంటి అద్దె ద్వారా పొందే ఆదాయం రూ.50 ల‌క్ష‌ల లోపు ఉంటే వారు ఐటీఆర్‌-1 లేదా స‌హ‌జ్ ఫారం దాఖ‌లు చేసేందుకు అర్హులు.

 జీతం, ఇంటి ఆస్తి నుంచి పొందే ఆదాయం, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం రూ. 50 లక్షలకు మించకపోతే  ఐటీఆర్ సహజ్‌కు అర్హత ఉంది. ఇతర వనరుల నుంచి ఆదాయం అంటే మూలధన లాభం,  వ్యాపారం నుంచి వ‌చ్చే లాభం వంటివి. లాటరీ, పందెం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం సంపాదించే వ్యక్తికి ఐటీఆర్ సహజ్ ఫారమ్‌కు అర్హత ఉండ‌దు.  అలాంటి ఆదాయం రూ.50 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఐటీఆర్ -2 ఫారమ్‌ను దాఖలు చేయాలి. క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉన్న‌‌ వ్యక్తి కూడా ఐటీఆర్ సహజ్ ఫారమ్‌కు అర్హత లేదని నిపుణులు చెప్తున్నారు.

కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న పించ‌న‌దారులు ఐటీఆర్ -3 లేదా ఐటిఆర్ -4 ఫారమ్‌ను దాఖలు చేయాలి, ఎందుకంటే వారి ఆదాయాన్ని వృత్తి లేదా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు.  పన్ను చెల్లింపుదారునికి వ్యవసాయ ఆదాయం రూ. 5000 వరకు ఉంటే ఐటిఆర్- సహజ్ ఫారమ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే, వ్యవసాయ ఆదాయం రూ 5,000 పైన ఉంటే పన్ను చెల్లింపుదారుడు ఐటీఆర్ సహజ్ ఫారమ్‌కు అర్హత పొందడు.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని