ITR Filing: ఐటీ రిటర్నుల దాఖలు గడువును మళ్లీ పొడిగిస్తారా? - ITR filing Deadline may get Extended Again
close

Updated : 23/08/2021 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ITR Filing: ఐటీ రిటర్నుల దాఖలు గడువును మళ్లీ పొడిగిస్తారా?

దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును మరోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తవెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న గడువును మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త వెబ్‌సైట్‌ శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు తెరచుకోని విషయం తెలిసిందే. దీనిపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వెబ్‌సైట్‌లో సమస్యలపై ఈ వెబ్‌సైటును సిద్ధం చేసిన ఇన్ఫోసిస్‌పై ఆదాయపు పన్ను విభాగం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సోమవారం కలిసి పరిస్థితులను వివరించాల్సిందిగా ఇన్ఫోసిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి సలిల్‌ పరేఖ్‌ను కోరినట్లు ఆదాయపు పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది. అత్యవసర నిర్వహణ నిమిత్తమే పోర్టల్‌ నిలిపేశామని, ఆదివారం రాత్రి నుంచి పనిచేస్తోందని ఇన్ఫోసిస్‌ ట్వీట్‌ చేసింది.

ప్రారంభమైన తొలిరోజు (జూన్‌ 7) నుంచే కొత్త వెబ్‌సైట్ www.incometax.gov.in లో సమస్యలు తలెత్తడంతో, జూన్‌ 22న ఇన్ఫోసిస్‌ ప్రతినిధులతో ఆర్థికమంత్రి సమావేశమై, సాధ్యమైనంత త్వరగా వెబ్‌సైటులో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇన్ఫోసిస్‌ అధిపతి నందన్‌ నీలేకని నుంచి కూడా ఎప్పటికప్పుడు సమచారాన్ని మంత్రి తెలుసుకుంటూనే ఉన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని