ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌.. సెప్టెంబరు 15 నాటికి సమస్యలు పరిష్కరించండి
close

Updated : 24/08/2021 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌.. సెప్టెంబరు 15 నాటికి సమస్యలు పరిష్కరించండి

ఇన్ఫోసిస్‌ను ఆదేశించిన ఆర్థిక మంత్రి

దిల్లీ: ఆదాయపు పన్ను కొత్త వెబ్‌సైటులో సాంకేతిక సమస్యలు కొనసాగడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ సమస్యలను సెప్టెంబరు 15 లోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఇన్ఫోసిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సలిల్‌ పరేఖ్‌కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 7న ఆదాయపు పన్ను కొత్త వెబ్‌సైట్‌ www.incometax.gov.in  అందుబాటులోకి వచ్చింది. తొలి రోజు నుంచే ఇందులో సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెల 21, 22 తేదీల్లో అత్యవసర నిర్వహణ కోసం అంటూ.. ఇన్ఫోసిస్‌ ఈ వెబ్‌సైటును పూర్తిగా నిలిపి వేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ, సోమవారం మంత్రిని కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్ఫోసిస్‌ ఎండీ-సీఈఓకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సలిల్‌ పరేఖ్‌ మంత్రితో సమావేశం అయ్యారు. దాదాపు 750 మందికి పైగా నిపుణులు ఈ వెబ్‌సైటుపై పనిచేస్తున్నారని, కంపెనీ సీఓఓ ప్రవీణ్‌ రావు వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారని మంత్రికి వివరించారు. రిటర్నులు దాఖలు చేసే వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పినట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. కొత్త పోర్టల్‌ అభివృద్ధికి ఇన్ఫోసిస్‌కు రూ.4,242 కోట్ల కాంట్రాక్టును ప్రభుత్వం ఇచ్చింది. జనవరి 2019 నుంచి జూన్‌ 2021 వరకు రూ.164.5 కోట్లను చెల్లించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని