ప‌న్ను రిఫండ్ రిజ‌క్ట్ కాకుండ‌దంటే.. ఈ ప‌ని పూర్తిచేయండి.  - pre-validate-your-bank-account-to-receive-income-tax-refund
close

Updated : 16/10/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప‌న్ను రిఫండ్ రిజ‌క్ట్ కాకుండ‌దంటే.. ఈ ప‌ని పూర్తిచేయండి. 

ప‌న్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించాల్సిన ప‌న్ను కంటే అద‌న‌పు ప‌న్ను చెల్లించిన‌ట్ల‌యితే.. అదనంగా చెల్లించిన ప‌న్ను మొత్తాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ రిఫండ్ చేస్తుంది. రిట‌ర్నులు ఫైల్ చేసిన త‌రువాత ఐటి శాఖ‌ వాటిని ప్రాసెస్ చేసి, వెరిఫై చేస్తుంది. ఈ ప్ర‌క్రియ పూర్తైన త‌రువాత‌.. మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) అధికంగా చెల్లించ‌డం లేదా ఆదాయ‌పు ప‌న్ను త‌ప్పుగా లెక్కించ‌డం వ‌ల్ల  చెల్లించిన అద‌న‌పు ప‌న్నును వాప‌సు ఇస్తుంది. 

ఐటీఆర్ దాఖ‌లు స‌మ‌యంలో ఇచ్చిన బ్యాంకు ఖాతాకు రిఫండ్ మొత్తాన్ని జ‌మ‌చేస్తారు. అందువ‌ల్ల రిట‌ర్నులు దాఖ‌లు చేసేప్పుడు ఖాతా నెంబ‌రుతో పాటు బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను ఇవ్వాలి. ఇచ్చిన ఖాతా వివ‌రాల‌లో త‌ప్పులు  లేకుండా ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.  బ్యాంకు ఖాతాను పాన్ నెంబ‌రుకు లింక్ చేస్తేనే ఐటీ శాఖ రిఫండ్ల‌ను ప్రాసెస్ చేస్తుంది. అంతేకాకుండా రిఫండ్ కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతా, పాన్.. రెండు కొత్త ఆదాయ‌పు ప‌న్ను ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌లో ప్రీ-వ్యాలిడేట్‌ చేసి ఉండాలి. లేక‌పోతే వాప‌సు పొంద‌లేరు. 

ప్రీ-వ్యాలిడేట్ ఎలా చేయాలి?
ఆదాయ‌పు ప‌న్ను ఇ-ఫైల్లింగ్ పోర్ట్‌కు లాగిన్ అయ్యి మీ ఖాతాలోని ‘మై ప్రొఫైల్’ ట్యాట్‌ ద్వారా బ్యాంకు ఖాతాను ధృవీక‌రించ‌వ‌చ్చు. అయితే దీని కంటే ముందు ఐటీ పోర్ట్‌లో ఇచ్చే మీ పాన్‌, మొబైల్ నెంబ‌ర్లు రెండు బ్యాంకు ఖాతాలో మాదిరిగా ఉండేట్లు చేసుకోవాలి. కాబ‌ట్టి ముందుగా మీ బ్యాంకులో వివరాల‌ను అప్‌డేట్ చేయాలి. ఎందుకంటే వివ‌రాల‌లో వ్య‌త్యాసం ఉంటే రిఫండ్లు ఆల‌స్యం అవుతాయి. 

రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల్లో ధ్రువీకరణ స్థితి(వ్యాలిడేష‌న్ స్టేట‌స్‌) మీ ఖాతాలో క‌నిపిస్తుంది. ఒక‌వేళ‌ ధ్రువీకరణ అభ్యర్థన తిరస్కరించబడితే..  వివ‌రాల‌ను స‌రిచేసుకుని మళ్లీ అభ్యర్థన చేయవచ్చు.

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిఫండ్‌ స్టేట‌స్ తెలుసుకునే విధానం..
ఆదాయ‌పు ప‌న్ను రిఫండ్ స్టేట‌స్‌ను కొత్త ఐటీ ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ ద్వారా గానీ, ఎన్ఎస్‌డిఎల్ వెబ్‌సైట్ ద్వారా గానీ తెలుసుకోవ‌చ్చు. ముందుగా కొత్త ఐటీ పోర్ట‌ల్ కు యూజ‌ర్ ఐడి(పాన్ నెంబ‌రు), పాస్వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఇ-ఫైల్ ట్యాబ్‌లో ఉన్న ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్ ఆప్ష‌న్‌ను ఎంచుకుని.. వ్యూ ఫైల్డ్ రిట‌ర్న్స్‌పై క్లిక్ చేయాలి. ఇక్క‌డ తాజాగా ఫైల్ చేసిన ఐటీఆర్ చెక్ చేయ‌చ్చు. వ్యూ డిటేల్స్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. 

ఎన్‌ఎస్‌డిఎల్ వెబ్‌సైట్‌లో ఐటిఆర్ స్టేటస్ తెలుసుకునే విధానం..
రీఫండ్ ట్రాక్ చేయడానికి ఉన్న మ‌రో విధాం ఎన్ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌. ముందుగా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి పాన్, ఆధార్, అసెస్‌మెంట్ ఇయర్ (ఎవై) వంటి మీ వివరాలను పూరించండి. వివరాలను సమర్పించిన తరువాత, 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి. మీ ఆదాయపు పన్ను స్టేట‌స్‌ కంప్యూటర్ స్క్రీన్‌లో క‌నిపిస్తుంది
 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని