మొద‌టి హ‌క్కు నామినీకే.. తర్వాతే వారసులు! - Nominees have first right over life insurance claims not legal heirs
close

Updated : 12/07/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొద‌టి హ‌క్కు నామినీకే.. తర్వాతే వారసులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా పాల‌సీదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు నామినీ, వారసుడి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించ‌డం చాలా ముఖ్య‌మైన విష‌యం.

బీమా పాలసీని మరణించిన పాలసీదారుని ఆస్తిగా పరిగణిస్తారు. దానిపై చట్టపరమైన వారసులకు హక్కు ఉంటుంది. అయితే, జీవిత బీమాలో బెనిఫీషియ‌ల్ నామినీ అనే ఒక అంశం ఉంది. ఈ నిబంధనను బీమా (సవరణ) చట్టం, 2015లో ప్రవేశపెట్టారు. దీనిప్ర‌కారం జీవిత‌ బీమాలో నామినీకే బీమా పాల‌సీపై మొద‌ట హ‌క్కు ఉంటుంది. ఒక‌వేళ‌ పాల‌సీదారుని కుటుంబ సభ్యుడి (తల్లిదండ్రులు, లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలను) నామినీగా చేస్తే, ఆదాయం ఉద్దేశించిన వ్యక్తికి వెళ్తుంది. చట్టపరమైన వారసులకు డబ్బుపై ఎటువంటి క్లెయిమ్ చేసుకునే వీలూ ఉండదు.

నామినీ లేనప్పుడు మాత్రమే.. చట్టపరమైన వారసుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయొచ్చు. దీనికోసం క్లెయిమ్ ఇంటిమేష‌న్ లెటర్, మరణ ధ్రువీకరణ పత్రం, లబ్ధిదారుడి ఐడీ ప్రూఫ్, పాలసీ పేపర్స్, డిశ్చార్జ్ ఫారం (ఏదైనా ఉంటే), పోస్ట్ మార్టం రిపోర్ట్, హాస్పిటల్ రికార్డులు (అసహజ మరణం విషయంలో) వంటి ఇతర అవసరమైన డాక్యుమెంట్ల‌తో పాటు, చట్టపరమైన వారసుడు బీమా హామీతో సహా మరణించిన పాలసీదారుడి ఆస్తులపై చట్టపరమైన వారసుడి హక్కును ఏర్పాటు చేసే సమర్థ న్యాయస్థానం జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

చట్టపరమైన వారసులు ఒక‌రి కంటే ఎక్కువ‌గా ఉండి, ఒకరు మాత్రమే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తుంటే, మిగతా చట్టపరమైన వారసులందరూ అంగీకరించి, దాని కోసం బీమా సంస్థకు తమ సమ్మతిని తెలియజేయాలి. ఒకవేళ పాల‌సీదారుడికి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండీ.. వారిలో ఒక్కరిని మాత్రమే నామినేట్‌ చేసిన పక్షంలో బీమా సంస్థ ఆ మొత్తాన్ని నామినీకి మాత్రమే చెల్లించాలి. మిగిలిన వారు తమ వాటాలకు సంబంధించి కోర్టులో దావా వేయొచ్చు. కాబట్టి బీమా క్లెయిమ్‌ల విష‌యంలో స్పష్టత పొందండి. తదనుగుణంగా వ్యవహరించండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని