close

Published : 29/04/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోవిడ్ చికిత్స కోసం పీఎఫ్ ఉప‌సంహ‌రించుకోవ‌చ్చా?

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ను దీర్ఘకాలిక రిటైర్మెంట్ ఫండ్ కార్పస్‌గా పరిగణిస్తారు, అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిబంధనల ప్రకారం, మెడికల్ ఎమర్జెన్సీ, ఫ్లాట్ లేదా భూమి కొనడం, ఇంటి నిర్మాణం మొదలైన కొన్ని పరిస్థితులలో పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి ఉంది.  వైద్య అత్యవసర సమయంలో లేదా చికిత్సకు అధిక ఖ‌ర్చు అవుతున్న‌ప్పుడు క్లిష్టమైన సమయంలో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. పీఎఫ్‌ లేదా ఈపీఎఫ్ ఖాతాదారుడు కోవిడ్ చికిత్స‌ కోసం కూడా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. వైద్య చికిత్స కోసం  పీఎఫ్ / ఈపీఎఫ్ ఖాతాదారుడు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది, వైద్య అత్యవసర పరిస్థితుల్లో  జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రుల వైద్యం కోసం కూడా తీసుకోవ‌చ్చు. 


మ‌రి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో  ఒక నెల ప్రాథమిక జీతానికి ఆరు రెట్లు లేదా పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి చేసిన‌ నికర డిపాజిట్‌, వడ్డీ ..ఇందులో ఏది త‌క్కువ అయితే అంత ఉపసంహరించుకోవచ్చు. వైద్య చికిత్స కోసం లాక్‌-ఇన్ లేదా నిర్థ‌ష్ట కాలం ఉద్యోగం చేసి ఉండాల‌న్న నిబంధ‌న‌లు ఏమి వ‌ర్తించ‌వు.

కోవిడ్ చికిత్స కోసం కూడా పీఎఫ్ / ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ ఉపసంహరణకు అనుమ‌తి ఉంది. కోవిడ్ కార‌ణంగా పీఎఫ్ ఖాతాదారుడు, జీవిత భాగ‌స్వామి, త‌ల్లిదండ్రులు లేదా పిల్ల‌లు ఎవ‌రైనా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో పీఎఫ్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. కానీ దానికోసం ఆసుపత్రి బిల్లులు, చికిత్స వివ‌రాల‌ను చూపించవలసి ఉంటుంది.
ఆసుపత్రిలో  ఒక నెల కన్నా ఎక్కువ కాలం ఉండాల్సి వ‌స్తే లేదా పెద్ద శస్త్రచికిత్స కోసం పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి ఉంది.  కోవిడ్ -19 వ‌ల్ల కూడా ఇంత‌కాలం చికిత్స తీసుకోవాల్సి వ‌స్తే, దానికి త‌గిన ఆధార‌లు ఉంటేనే పీఎఫ్ తీసుకోవ‌చ్చు.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని