మనకు ఎంత మొత్తం వైద్య బీమా అవసరం? - Corpus-for-medical-expenses
close

Published : 10/08/2021 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనకు ఎంత మొత్తం వైద్య బీమా అవసరం?

సాధారణంగా మనకు ఎంత మొత్తం వైద్య బీమా అవసరం అవుతుందనే ప్రశ్నకు రెండు మార్గాల్లో సమాధానం ఇవ్వవచ్చు: 

1. మీ స్థోమత ఆధారంగా 
2. పాలసీ విలువ రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు..

సాధారణంగా రెండవ మార్గం కోసం అధిక ప్రీమియం అవసరమవుతుంది కావున చాలా మంది అంత మొత్తాన్ని చెల్లించలేరు. అందువలన పెరుగుతున్న వైద్య ఖర్చులను, జీవనశైలి వ్యాధులు, ఖరీదైన చికిత్సలకు అవసరమైన ఖర్చులను భరించడానికి ప్రతి ఒక్కరూ కార్పస్ ను నిర్మించుకోవడం అవసరం. వైద్య ఖర్చుల కోసం కార్పస్ ను నిర్మించడానికి అనుసరించాల్సిన సులువైన మార్గాల గురించి కింద వివరించాము. 

వైద్య ఖర్చుల కోసం మనందరికీ కార్పస్ ఎందుకు అవసరం?

1. లక్షల రూపాయల్లో కవరేజ్ కలిగిన ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం, ఇది మీ వయసు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ బీమా సంస్థ పరిహారాలను చెల్లించడం ద్వారా నష్టాలను ఎదుర్కొన్నట్లైతే, ఆరోగ్య బీమా విలువ మరింత పెరుగుతుంది. 
2. ఆరోగ్య బీమా వైద్య ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది. కానీ వైద్యేతర ఖర్చులు అనేకం ఉంటాయి, అవి ఆసుపత్రి బిల్లులో 15 నుంచి 20 శాతం వరకు ఉండవచ్చు.
3. ఆరోగ్య బీమా జీవనశైలి వ్యాధుల (మధుమేహం లేదా గుండె సంబంధిత రోజువారీ ఖర్చులు) చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేయదు. ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవడానికి, అలాగే దానికి అయ్యే ఖర్చులను తెలుసుకోడానికి దీర్ఘకాలిక అనారోగ్య కాలిక్యులేటర్ ను ఉపయోగించుకోవచ్చు.
4. క్రిటికల్, నాన్ - క్రిటికల్ అనారోగ్యానికి అయ్యే ఖర్చులు కేవలం రోజులు లేదా నెలల వ్యవధిలోనే లక్షల రూపాయలకు చేరుకోవచ్చు. ఒక క్రిటికల్ ఇల్నెస్ కవర్ చాలా ఖరీదైనది.
5. ఒకవేళ బీమా సంస్థలు నష్టాన్ని నివేదిస్తే, ప్రీమియంలు అమాంతం పెరిగిపోతాయి.  

ప్రైవేటు, పబ్లిక్ ఆరోగ్య బీమా సంస్థలు రెండూ పెద్ద సంఖ్యలో నష్టపరిహారల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్నందున ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరుగుతున్నాయి. 
 
మీకు, మీ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం  కనీసం రూ. 1 కోటి కార్పస్ మీ వద్ద ఉన్నట్లైతే, ఆరోగ్య పాలసీలకు అధిక ప్రీమియంలను చెల్లించడం ఆపివేయచ్చు. ఒకవేళ మెడికల్ ఖర్చుల కోసం మీ దగ్గర అంత మొత్తం కార్పస్ లేకపోతే, మీరు కచ్చితంగా ప్రీమియంలను చెల్లించాలి. మీకు వేరొక ప్రత్యామ్నాయం లేదు.

వైద్య ఖర్చుల కోసం కార్పస్ ను ఎలా నిర్మించుకోవాలి?

1. మీ ప్రస్తుత దీర్ఘకాల లక్ష్యాల కోసం మరింత మొత్తంలో పెట్టుబడులు పెట్టండి :  

ఉదాహరణకు మీ ప్రస్తుత పెట్టుబడులకు కనీసం నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 జత చేయడానికి ప్రయత్నించండి. ఇది కొంచం కష్టం అయినప్పటికీ ప్రయత్నించండి. అదనపు మొత్తంలో 40 శాతం స్థిర ఆదాయంలో, అలాగే 60 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి.  

* 15 సంవత్సరాల పాటు నెలకు రూ. 5000 చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే, 10 శాతం రాబడులతో రూ. 20 లక్షల కార్పస్ ను పొందగలరు. 
* నెలకు రూ. 1000 అదనంగా పెట్టుబడి పెట్టినట్లయితే, 15 సంవత్సరాల తర్వాత అదనంగా మరో 4 లక్షల కార్పస్ ను పొందగలరు. 

2. వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి :  

కార్పస్ ను నిర్మించుకోడానికి సమయం చాలా ముఖ్యం. త్వరగా పెట్టుబడులను పెట్టడం ప్రారంభిస్తే, పెద్ద మొత్తంలో కార్పస్ కోసం మరింత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.  

3. పెట్టుబడులను పెంచండి: 

ప్రతి సంవత్సరం కనీసం 5 శాతం పెట్టుబడులను పెంచడానికి ప్రయత్నించండి, 10 శాతం పెంచితే మరి మంచిది. ఇది అంత సులభం కాదు, కానీ ప్రయత్నించాలి.

4. అత్యవసర ఫండును ఏర్పాటు చేసుకోండి: 

సమీప భవిష్యత్తులో మీకు, మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. కనీసం 6 నుంచి 8 నెలల నెలవారీ ఖర్చులను అత్యవసర ఫండ్ కింద ఉంచడం మంచిది. దీనిని మీ బ్యాంకు పొదుపు ఖాతాలో లేదా ద్రవ నిధి రూపంలో ఉంచవచ్చు.

5. ఎక్కువ కవరేజ్ కలిగిన ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయండి: 

ఎక్కువ కవరేజ్ కలిగిన ఆరోగ్య బీమా పాలసీని వీలైనంత త్వరగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. అలాగే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి.  

6. కార్పస్ ను వృద్ధి చేసుకోడానికి సమయం పడుతుందని గుర్తుంచుకోండి: 

కార్పస్ ను వృద్ధి చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. కావున మీకు అవసరమైన కార్పస్ ను 15 సంవత్సరాల్లో లేదా అంత కంటే ముందే పొందేలా ప్రణాళికను రూపొందించుకోండి. ఈ సమయంలో ఆరోగ్య బీమా, అత్యవసర ఫండ్ తో మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని