ఒక తండ్రిగా.. ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి? - Health-cover-options-for-fathers-based-on-age
close

Published : 21/06/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక తండ్రిగా.. ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి?

ప్రతీ ఒక్కరి ఆర్థిక ప్రణాళికలోనూ ఒక సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యేకించి తల్లిదండ్రుల విషయంలో ఇది భద్రతా వలయంలా పనిచేస్తుంది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పిల్లలు డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం రాకుండా ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.

అధిక శాతం కుటుంబాల‌లో తండ్రి మాత్రమే కుటుంబానికి మూలాధారం అవుతాడు (ప్రస్తుతం ఈ పరిస్థితులు మారుతున్నాయి. తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగం చూస్తూ సంపాదిస్తున్నారు.)  అలాంట‌ప్పుడు ఆరోగ్య బీమా అవసరం మరింత పెరుగుతుంది. 

బాధ్యతాయుతమైన తండ్రిగా.. ప్రస్తుతం మీరున్న జీవిత దశ / అవసరాలు / రిస్క్ తీసుకునే సామర్థ్యం, చెల్లింపుల సామర్థ్యం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

తండ్రులు వారి వయసు, జీవిత దశ అనుసరించి రెండు రకాలుగా ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకోవచ్చు. ఒకటి పదవీ విరమణకు ముందు.. రెండు పదవీ విరమణ తరువాత..

పదవీ విరమణకు ముందు.. వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు
“మీరు మధ్య వయస్కుడైన తండ్రి అయితే, తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. కొన్ని బీమాసంస్థలు వెల్నెస్ ప్రోగ్రామ్‌ల‌లో పాల్గొన్న వారికి రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. అందువల్ల వెల్నెస్ ప్రోగ్రామ్లను వీలైనంత వరకు ఉపయోగించుకోవాలి. మారథాన్ / ఇతర ఫిట్నెస్ కార్యకలాపాలలో పాల్గొనడంతో పాటు, వాటిని విజయవంతంగా పూర్తి చేయాలి. ఆరోగ్యకరమైన జీవినశైలిని అలవరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిట్‌గా ఉండడంతో పాటు, మొదడు, శరీరం కూడా చురుకుగా పనిచేస్తాయి. వయసుతోపాటు సాధారణంగా వచ్చే అనారోగ్యాలను దూరంగా ఉంచేందుకు ఈ జీవనశైలి సహాయపడుతుంది. కస్టమర్లు ఉపయోగించుకునే వెల్నెస్ ప్రోగ్రామ్లకు రివార్డులు కూడా ఉన్నాయి, బీమా ప్రొటెక్టర్‌ను కూడా ఎంచుకోవచ్చు. 

పెరుగుతున్న వయసుకు తగిన బీమా కవర్ వుండాలి అని కోరుకునే.. మధ్య వయసు వ్యక్తికి వీటితో ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు ప్రకారం బీమా మొత్తాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరానికి నోక్లెయిమ్ బోనస్/ అదనపు హామీ మొత్తాన్ని ఇస్తాయి బీమా సంస్థలు. 

పదవీ విరమణ తరువాత.. ఓపీడీ హెల్త్ ప్లాన్
సీనియర్ సిటిజన్లు అయిన తండ్రులు..అవుట్‌ పేషెంట్ డిపార్ట్మెంట్(ఓపీడీ) ప్లాన్ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఇది అవుట్-పేషెంట్ ఖర్చులను తగ్గించి ఆరోగ్యంగా ఉండేదుకు కేర్ తీసుకోవచ్చు. అదనంగా క్లెయిమ్ ప్రొటెక్టర్ కవర్ను ఎంచుకోవచ్చు. ఇది ఆసుపత్రిలో చేరినప్పుడు ఖర్చులను తగ్గిస్తుంది. 

ఆరోగ్య బీమా కవరేజ్‌ను వ్యక్తులు వారి వయసు, అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్ధ్యాల ఆధారంగా ఎంచుకోవాలి. పదవీ విరమణ వయసులో ఉన్న తండ్రులు అవుట్-పేషెంట్ కవర్ తీసుకోవడం మంచి నిర్ణయం అయితే, చిన్న వయసులో ఉన్న తండ్రులు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే బిడ్డలనూ కవర్చేయడం అవసరం. 

చివరిగా..
కుటుంబ యజమానిగా.. కుటుంబంలో ఉన్నవారి అవసరాలకు, ఆరోగ్య స్థితికి తగినట్లు పాలసీలను కొనుగోలు చేయాలి. పాలసీ కొనుగోలు చేసేముందు అందులోని అంశాలను నిశితంగా తెలుసుకోవాలి. దీంతో మీకు ఆ పాలసీ మీ అవసరాలకు తగినట్లు ఉన్నది.. లేనిది తెలుస్తుంది. కావలసిన ప్రాడెక్ట్లను కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు క్లెయిమ్ చేయాల్సి వస్తే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడొచ్చు. కుటుంబానికి మూలధారం అయిన వారు ఆరోగ్య బీమా పాలసీతో పాటు జీవిత బీమాను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని